Sunday, June 29, 2014

మౌనంగ మన ఈ కథ ను ముగించాలని ఉంది (love letter, unposted)


మనసు విప్పాలని ఉంది
నీ తొ మాట్లాడాలని ఉంది 
మన మధ్య గడిచిన ఈ కాలం కబుర్లు చెప్పాలని ఉంది

నీకు నెను గుర్తొచినప్పుడు 
ఎం చెస్తావొ చెబితె వినాలని ఉంది
నా జ్ఞపకాలని ఎక్కడ దాచావొ
ఆ గుండె చప్పుడు మల్లి వినాలని ఉంది

పాత రొజులు గుర్తు చెసుకొని నువ్వు నవ్వితె
ఆ నవ్వు చూడాలని ఉంది
నీ పిల్లలకి రాజు రాని కథ చెప్పినప్పుడు
ఆ కథ లొ రాని వర్నన వినాలని ఉంది

పౌర్నమి రాత్రి ఆ చంద్రున్ని చుసి
నన్ను తల్చుకున్న ద్రుష్యం చూడాలని ఉంది
భద్రంగ దాచుకున్న మన photo
నీ బట్టల మడతల్లొనుంచి వెతికి తీయాలని ఉంది

నువ్వు ఎదిగె ప్రతి మెట్టు మీద 
పూల వాన కుర్పించాలని  ఉంది
ఎండ వాన గాలి ఐ ఎల్లప్పుడు
నీ తొ ఉండాలని ఉంది

కాసెపటి కొసమైన ఆ రొజులు
మల్లి నీ తొ జీవించాలని ఉంది
ఇధి చదువుతున్నపుడు నీ కల్లలొని 
ఆ నీల్లు తుడవాలని ఉంది

ఈ నా మాటలు నువ్వు
చదవకుండ జాగ్రత పడాలని ఉంది
నీ బాద్యతలను గౌరవించాలని ఉంది
మౌనంగ మన ఈ కథ ను  ముగించాలని ఉంది

No comments:

Post a Comment