Sunday, June 25, 2017

ఆకారం స్వరూపం లేని ఆత్మకేంతెలుసు

ఆకారం స్వరూపం లేని ఆత్మకేంతెలుసు 
మనసున్న శరీరాలకు ఉండే భావాలు , భావోద్వేగాలు 
అద్దె ఇంట్లో ఉన్నట్టు వ్యవహరించాలని అతిథి లాగ ప్రవర్తించాలని 
హిత బోధ చేసే ఆత్మను ఎలా నమ్మాలి ఎందుకు గౌరవించాలి
మనసుని చంపుకొని బ్రతకాలని ఆదేశాలు మార్గదర్శనం జ్ఞానోదయం 
అస్సలు అనుబంధాలు పెంచుకొవద్దు అని జ్ఞాన బోధ చేసె వెలుగువి నీవు 
శవానికి అంటిన నిప్పు చల్లారకముందే ఆత్మ విముక్తి కి మరి పూజలెందుకో ?
ఆత్మ సాక్షి కన్నా మనసాక్షే గొప్పది , నిజమైనది
స్పృహ ఉన్నన్నాళ్ళు శరీరం సత్యం, ఆత్మ మిథ్యం
శారీరిక మానసిక అవసరాల కోసమే నా తపన , తాపత్రేయం 
నవ్వుతు ఏడుస్తూ ప్రేమిస్తూ గెలుస్తూ ఆడిస్తూ
నిండుగా నా శరీరమై నేనై జీవిస్తా 
చచ్చినాకే ఆత్మనై , ఆత్మ గా చలామణి అవుతా 
అంత వరకు నాకు ప్రేమలు అనుబంధాలు సంబంధాలు 
పంచేద్రియాలు కలిపించే అనుభూతులు , ఇవి ముఖ్యం 
to hell with detachment and liberation ..

No comments:

Post a Comment