నీతో నడిచిన సప్తపది నన్ను నేను పొందటం కొరకేనని
నాకు తెలియని నన్ను నిత్యం నూతనంగా పరిచయం చేస్తూ
నేను ఊహించలేని కారణాల కోసమే నా జన్మ అని
నా గమ్యం, ధ్యేయం మునుపెప్పుడూ నేను ఊహించనివి అని
నా ఆత్మా తో నాకు ముఖా ముఖి ఏర్పరచి
ఆత్మా వెలుగులో అద్ధం చూపించి
స్ఫూర్తి , ఉత్సాహం నింపి
నా మీద నాకు నమ్మకం కలిగించి
అహం జత చేసిన భారాలన్ని దించి
ఈ మహా సృష్టి లో నా కష్టాలు, బాధలు ఏ పాటివొ చూపించి
అను నిత్యం నన్ను నాకు నూతనంగా పరిచయం చేస్తూ
నా కోసం నువ్వు పుట్టావా నీ కోసం నేను పుట్టానా
కాదు కాదు , ఒకరికోసం, ఒకరమేమోనని
సృష్టి రచనలో భాగంగా , కాల నిర్ణయాలకు అనుగునంగా
ఆ దేవదేవుడు రచించిన పాత్రలు జీవిస్తి
నన్ను నేను వెతుకుంటూ, కనుగొంటూ ,ప్రశ్నిస్తూ ,
ఆస్వాదిస్తూ నీతో నడుస్తున్న నాలుగు అడుగులు ఇవి
నాకు నేను ఒక గమ్యంగా పరిచయమైనా తీయని గమనమిది
అడుగడుగునా నన్ను నేను కొత్తగా పొందిన ఆవిశ్కారమిది
ఎంతో అందమైన ప్రయాణం ఇది
ఎంతో అందమైన ప్రయాణం ఇది