జీవితం జన్మ జన్మల ప్రయాణం అని
ఆత్మ కి అంతే లేదని
ప్రతి క్షణం ,మనమే , మన కర్మలతో
రాబోయే రోజు కి పునాది వేస్తున్నామని
ఈ వివేకమును మించిన జ్ఞానం లేదని
నీ సన్నిధి లో చేరి
నువ్వు ఇచ్చిన ఈ అవకాశాన్ని
నీ ఆశయ సాధన కోసం ఎలా వినియోగించుకోవాలా, అని
నేను నా అంతరాత్మ తరచూ మాట్లాడుకుంటాము
చిన్న చిన్న కష్టాలు ఇచ్చి
బ్రతకటం నేర్పిస్తూ
దారి తప్పిన ప్రతిసారి పాప ప్రక్షాళన చేసుకునే
అవకాశం కల్పిస్తూ
కనిపించకుండానే ,కనిపెడుతూ
నేను ఉన్నాను , నిన్ను చూస్తున్నాను
అని ఎంతో ప్రేమతో మందలిస్తావు .
అరహత కు మించిన ఆనందాన్ని
ఊహించని ఐశ్వర్యం,అంతస్తు కలిపించి
ఎంతగానో సత్కరిస్తావు .
అస్సలు ఇవ్వన్ని నాకెందుకు ఇస్తున్నావని
నిన్నేపుడ్డు ప్రశ్నించనే లేదని సిగ్గుపడ్తున్నాను
తల్లి,తండ్రి , అక్క, తమ్ముడు
బందువులు ,స్నేహితులు
బర్తా ,బిడ్డ , అందరిని అమర్చి
ఆ తరువాతే నన్ను పంపుతావు
ఇన్ని ,అడగకుండానే ఇస్తావు
కాని దీనిలో , ఏ ఒక్కటి తక్కువైన
వెంటనే నిన్ను నిలదీస్తామే
అని ఎంతో బాదతో నేను
నా అంతరాత్మ మాట్లాడుకుంటూ ఉంటాము
నువ్వు కల్పించే అవరోధాలు నా మంచికేనని
కింద పడేసేది , పైకి లేవడం నేర్చుకోవాలని
ఏదైనా సాదించిన ప్రతిసారి ఇది నా కృషి
అని బల్లగుద్ది చెప్పే నేను
ఓటమిని అదే స్పూర్తి తో
ఎందుకు అంగికరించలేక పోతున్నానో
అని సిగ్గు పడ్తున్నాను
ఎవరు అధిగమించలేని వారు, లేనేలేరని
ఒకరిని మించిన మరొకరిని నువ్వే సృష్టిస్తావని
ఎక్కడికక్కడ సమతుల్యత ను పాటిస్తావనే నమ్మకం
నాకింత ఆలస్యంగా ఎందుకు కల్గిందా అని
నేను నా అంతరాత్మ నా అహం పై యుద్ధం కి దిగుతున్నాము
ఇచ్చిన , కాలానికి తిరిగి తీసుకునే శక్తి ఉందని
పొందిన ప్రతిది శాశ్వతం కాదని
పోగొట్టుకున్న దాని మీద
మన హక్కు అంతవరకేనని
ఎప్పటికప్పుడు జ్ఞాన బొద చేస్తూనే ఉంటావు
ఇన్ని విధాలుగా , ప్రతి క్షణం
నువ్వు నాలో ఉండి , నాతో పాటు
ఇవ్వన్ని అనుబవిస్తున్నావని
జీవిస్తున్నవని , తెలుసుకో లేక పోయినందుకు
సిగ్గుతో, బాదతో నేను న అంతరాత్మ రోదిస్తున్నాము